ప్రస్తుతం కథ డిమాండ్ ప్రకారం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్న వెంకటేష్ తాజాగా తన 75వ మూవీని `హిట్` సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా `హిట్ 2` తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను హీరో విక్టరీ వెంకటేష్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ కు రెడీ అయ్యారు.
నిహారిక ఎంటర్టైన్‌మెంట్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.వెంకీ 75 వ చిత్రం యొక్క గ్లింప్స్ విడుదల అయ్యింది. మిషన్ గన్ తో ఎప్పుడూ లేని విధంగా వెంకీ సూపర్ గా కనపడుతున్నాడు. ఒకప్పుడు వెంకటేష్ మినిమం గ్యారెంటీ హీరో, తాను చేసిన అన్ని సినిమాలలో ఎక్కువ శాతం హిట్స్ గా ఉండేవి. ఇప్పుడు మరో సారి 75 సినిమా తో మళ్లీ యాక్షన్ రంగంలోకి దిగుతున్నాడు.
ఇక ఈ సినిమా తో హిట్ 2 తో మంచి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు శైలేష్ కొలను ఈ చేయనుండడం తో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు ట్విట్టర్ లో ఇది కేవలం ట్రిబ్యూట్ మాత్రమే కాదు అని, నేను ఫిల్మ్ మేకర్ గా మారడానికి ఒక కారణం ఏమిటంటే, నేను అతని కోసం సినిమాను చేయాలనుకుంటున్నాను. అతను మరియు అతని అభిమానులు గర్వపడేలా తను చిత్రం కోసం కష్టపడతా అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
It’s not just a tribute, I feel one of the reasons why I became a film maker is that I am destined to do this for him 🙂 Will put in my blood and sweat to make him and his fans proud 🙂 https://t.co/Nm1UFOCfp7
— Sailesh Kolanu (@KolanuSailesh) January 26, 2023