Vijay 66: ‘వారసుడు’ గా వచ్చేసిన దళపతి విజయ్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ – టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘తలపతి 66’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. ఇందులో విజయ్ కు జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇది తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

వెరీ డిఫరెంట్ స్టోరితో సినిమా తెరకెక్కుతున్నదని దిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న చిత్రం ఇది. కాగా, ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేసేసింది చిత్ర బృందం. “వారుసుడు” అనే డిఫరెంట్‌ టైటిట్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news