యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తీసింది రెండు సినిమాలే అయినా..ఆయన స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను పొందారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ ఫిల్మ్ చేస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ తీసిన గత చిత్రాలు ‘ఖైదీ, మాస్టర్’ రెండు కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి.
ఈ రెండు పిక్చర్స్ తెలుగులోనూ విడుదలై సక్సెస్ అయ్యాయి. ‘మాస్టర్’ పిక్చర్ ఓటీటీలో రికార్డ్ లు సృష్టించింది. ఇందులో విజయ్, విజయ్ సేతుపతిల యాక్టింగ్ కు సినీ అభిమానులు ఫిదా అయ్యారు. కాగా, లోకేశ్ కనకరాజ్ ప్రస్తుత చిత్రం ‘ విక్రమ్’ లోనూ భారీ తారాగణమే ఉంది.
ఈ మూవీ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. ఇందులో మాలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, జయరాం కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ రవించందర్ మ్యూజిక్ అందించగా, మ్యూజికల్ రిలీజ్ ఈవెంట్ ను ఎవరూ ఊహించని విధంగా చేయాలని కమల్ హాసన్ డిసైడ్ అయినట్లు టాక్.
దుబాయ్ వేదికగా సదరు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ తన ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు.పాన్ ఇండియా మాత్రమే కాదు..అవసరమైతే పాన్ వరల్డ్ లెవల్ లో ప్రమోషన్స్ ఉండాలని అనుకుంటున్నారట మేకర్స్.
ఇక ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే రైలు ఇంజన్లపై కూడా ఈ పిక్చర్ పోస్టర్స్ అంటిస్తూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ ఫిల్మ్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను హీరో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ దక్కించుకుంది. మొత్తంగా ఈ చిత్రం ప్రమోషన్స్ తో నెక్స్ట్ లెవల్ లోకి ఈజీగా వెళ్తుందని డైరెక్టర్ లోకేశ్ భావిస్తున్నారట.