Big Boss Non Stop: ఎంటర్‌టైన్మెంట్ కా బాప్ బాబా మాస్టర్..‘బిగ్ బాస్’లో టాప్ కంటెస్టెంట్ అయ్యేనా?

-

కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ ’ ఓటీటీ ఆరో సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ బాబా మాస్టర్ తనదైన శైలిలో కంటెస్టెంట్స్ పై పంచులేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబా మాస్టర్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

‘బిగ్ బాస్’ ప్రేక్షకులు, లవర్స్ కు ఆల్రెడీ పరిచయమైన బాబా మాస్టర్ .. రియల్ లైఫ్ స్టోరి ఇన్ స్పైరింగ్ గానే ఉంటుందని ఈ సందర్భంగా బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన బాబా మాస్టర్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. ఈ నేపథ్యంలోనే అతను డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రుల సహకారం తో డ్యాన్స్ నేర్చుకోవడానికి బయలు దేరాడు.

శివ శంకర్‌ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా కొన్నేళ్లు పని చేసిన బాబా మాస్టర్..తర్వాత సుందరం మాస్టర్ అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. కొరియోగ్రఫీలో టెక్నిక్స్ నేర్చుకున్న బాబా మాస్టర్..ఆ తర్వాత సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేయడం స్టార్ట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బాబా మస్టర్..స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోయారు.

స్టార్ హీరోలందరి సినిమాల్లో సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన బాబా మాస్టర్..హీరోలందరితో విభిన్నమైన స్టెప్పులేయించాడు. తెలుగుతో పాటు తమిళ్ హీరోలతో ఎక్కువగా వర్క్ చేశాడు బాబా మాస్టర్. మహేశ్ బాబు, రామ్ చరణ్, నాగార్జున సినిమాల్లో పని చేసిన బాబా మాస్టర్..ఇప్పుడు ‘బిగ్ బాస్ ’ ఓటీటీ షోలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. చూడాలి మరి..వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మాస్టర్..ఎప్పటి వరకు హౌజ్ లో ఉంటారో.. అయితే, అక్కడ తనదైన మాటలు, డ్యాన్స్ స్టెప్పులతో బీబీ లవర్స్, ప్రేక్షకులను, కంటెస్టెంట్స్ ను ఎంటర్ టైన్ చేస్తు్న్నాడు బాబా మాస్టర్.

Read more RELATED
Recommended to you

Latest news