వరంగల్ లో ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక.. ఎప్పుడంటే..

వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “విరాటపర్వం”. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రానా మరోసారి పవర్ ఫుల్ పాత్రలో ఆకట్టుకోనున్నాడు. అతడి భావజాలాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయిపల్లవి కనిపించనుంది.

ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న గా కనిపించనున్నాడు. 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాటపర్వం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కర్నూలులో జరిగింది. వర్షం కారణంగా అనుకున్నంతగా ఈ కార్యక్రమం జరగలేదు. ఇక ఇప్పుడు విరాటపర్వం టీం ప్రేక్షకులను కలవనున్నారు. వరంగల్ వేదికగా విరాటపర్వం చిత్ర బృందంతో ఆత్మీయ వేడుకను నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జూన్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విరాటపర్వం సినిమా విడుదల కానుంది.