OTTలో ‘విరాట పర్వం’..సినిమాకు ఫుల్ డిమాండ్..అన్ని కోట్లకు డీల్

-

యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ సినిమా ఈ నెల 17న విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ పిక్చర్…వరంగల్ జిల్లాలో 1990ల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

తూము సరళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వేణు ఊడుగుల. ప్రముఖులు సైతం ఈ ఫిల్మ్ చూసి మెచ్చుకుంటున్నారు. థియేటర్లలో ఈ సినిమా చూసి జనాలు భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, ఈ సినిమా OTT రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి.

‘విరాటపర్వం’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. రూ.15 కోట్లు పెట్టి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ రైట్స్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరిని బ్యాలెన్స్ చేస్తూ ‘విరాట పర్వం’ సినిమాను చక్కగా తెరకెక్కించారు వేణు ఊడుగుల. దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ పిక్చర్ కు సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news