మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితులపై రెబల్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం గా ఉద్దవ్ థాక్రే అలాగే కొనసాగాలని.. రెబల్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అంతేకాదు.. థాక్రే సీఎం గా ఉంటూనే… బీజేపీ పార్టీతో కలవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చిక్కుముడి వచ్చి పడింది.
ఇది ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాశారు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే. రెబల్ ఎమ్మెల్యేల నేత ఏక్నాథ్ షిండే 3 పేజీల లేఖ విడుదల చేశారు. తమ దగ్గర 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. కాసేపట్లో గవర్నర్కు లేఖ రాస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు వార్నింగ్ ఇచ్చారు.
సీఎం ఎవరికీ అందుబాటులో ఉండట్లేదని… సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయని ఏక్ నాథ్ షిండే లేఖలో వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇన్ని రోజులు దారుణంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు.