గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘విరాట పర్వం’ రిలీజ్ ట్రైలర్..

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ పిక్చర్ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ వెన్నెల పుట్టకకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ట్రైలర్ విడుదల చేశారు.

రక్తపాతంతో వెన్నెల పుట్టుకను అభివర్ణిస్తున్న ట్రైలర్ చూస్తుంటే ప్రతీ ఒక్కరు భావోద్వేగానికి గురవుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నక్సలైట్ మరణం, వెన్నెల పుట్టుకను లింక్ చేస్తూ దర్శకుడు కట్ చేసిన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

నివేదా పేతురాజ్ నక్సలైట్ పాత్రధారిగా కనిపిస్తుండగా, డాక్టర్ గా తల్లి కి కాన్పు చేసిన క్రమంలో తన ప్రాణాలు కోల్పోయింది. నాలుగు నిమిషాల వీడియో చాలా బాగా ఉందని ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారం తెరకెక్కిన ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా, సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరితో సురేశ్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.