కెసిఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కెసిఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కెసిఆర్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. ఎనిమిది ఏళ్లలో బాగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరేనని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని.. రెండు లేదా మూడు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీ ఏర్పాటు హాస్యాస్పదం అని ఉత్తమ్ వ్యాక్యానించారు. ప్రతిపక్షాల సమావేశానికి టిఆర్ఎస్ హాజరు కాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.ఎన్డిఏ ను ఓడించే అవకాశం వచ్చినప్పుడు కెసిఆర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news