కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది.
అయితే.. విరూపాక్ష సినిమాతో బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుకు చిత్ర యూనిట్ ఖరీదైన కారును బహుమతిగా అందించింది. ఇది తనకు లైఫ్ టైం మెమొరీ అని కార్తీక్ బెంజ్ కార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన గురువు సుకుమార్, హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాతలు BVSN ప్రసాద్, బాపినీడుకు థాంక్స్ చెప్పారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.