వీకెండ్ విండో : ఆ 3 సినిమాలతో మన ఫేట్ మారిందట !

-

తెలుగు, క‌న్న‌డం, త‌మిళం
ఈ ట్ర‌యోలో ఒక‌ప్పుడు తేడాలు ఉండేవి
వీటికి తోడు మ‌ల‌యాళ సినిమా అంటే
ఓ విధంగా ఓ స్థాయి ఉన్న సినిమానే కానీ
క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాద‌న్న అపోహ కూడా ఉండేది
ఇప్పుడు ఆ లెక్క‌లు అన్నీ చెరిగిపోయి కొత్త‌గా
ద‌క్షిణాది  సినిమా ప‌రిశ్ర‌మకు సంబంధించి స్టామినా
ఒక్క‌సారిగా అనూహ్యంగా పెరిగిపోయింది.
క‌నుక ఇప్పుడు బీ టౌన్ అవాక్క‌వుతోంది.

ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

ఆదివారం అనే ఓ వారాంత వేళ క‌థ ఎలా ఉన్నా సినిమా మాత్రం ఆకట్టుకోవాలి. వారాంతపు వేళ నెక్ల‌స్ రోడ్, ట్యాంక్ బండ్ మాదిరిగానే మ‌రికొన్ని సంద‌ర్శ‌క ప్రాంతాల మాదిరిగానే మ‌న ఐ మ్యాక్స్ కూడా నిండు గ‌ర్భిణిని త‌ల‌పించిన విధంగా ఉండాలి. ఉంటే బాగుంటుంది. అదే స్థాయిలో వివిధ స్థాయిలలో వివిధ సౌక‌ర్యాల‌తో న‌డిచే థియేట‌ర్ల‌కూ అంతే మంచి జ‌ర‌గాలి. ఆ విధంగా సంబంధిత ప‌రిణామాలు చోటు చేసుకోవాలి.

ఇప్పుడు సినిమా వారం రోజులు ఆడితే రిజ‌ల్ట్ పైకి తేలుతుంది. మూడు రోజులు బాగా న‌డిస్తే అంటే వ‌రుస హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డిస్తే రిజ‌ల్ట్ ఇంకాస్త పైకి తేలుతుంది. కొన్నిసార్లు సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా కూడా వీకెండ్ బొనాంజా మాత్రం థియేట‌ర్ల‌కు ఉంటే చాలు. ఆ విధంగా ఈ ఏడాది మొద‌టి స‌గం లోనే అన‌గా ఫ‌స్ట్ ఆఫ్ లోనే మూడు సినిమాలు మంచి డ‌బ్బులు తీసుకు వ‌చ్చాయి థియేట‌ర్ల‌కు. ఓవిధంగా ప్ర‌భాస్ లాంటి హీరోలు కాస్త దృష్టి పెట్టి ఉంటే ఆయ‌న‌కు కూడా బాక్సాఫీసును క‌దిపి కుదిపేవాడు. కానీ కుద‌ర్లేదు.

రాధే శ్యాం ఆయ‌న‌కు ఓ విధంగా వంద కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను మిగిల్చింది. దీంతో ఆయ‌న నిరాశ‌లో ఉన్నారు. ప్రొడ్యుస‌ర్ కు అండ‌గా ఉండేందుకు, కొనుగోలు దారుల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు  త‌న రెమ్యున‌రేష‌న్ లో కొంత మొత్తం ఇచ్చేశారు. ఆ విధంగా ప్ర‌భాస్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు.

ఇక బాక్సాఫీసు వ‌ద్ద మంచి ఫ‌లితాలు ద‌క్కించుకున్న ట్రిపుల్ వెయ్యి కోట్ల బొనాంజాను ఎప్పుడో అందుకుంది. అయితే ప‌ది రోజుల పాటు కాస్త అటు ఇటు ఊగిసలాడుతూనే ఈ మొత్తం రాబట్టుకుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో మొద‌ట వీట‌న్నింటి క‌న్నా ముంద‌ర విడుద‌ల అయిన పుష్ప ఓ రేంజ్ స‌క్సెస్ అందుకుంది. విడుద‌ల డిసెంబ‌ర్ 17,2021 అయిన‌ప్ప‌టికీ త‌న హ‌వాను ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ ఉంది.

ఇప్ప‌టికీ మంచి టాక్ తోనే ఎక్క‌డో ఓచోట చ‌ర్చ‌కు తావిస్తోంది. అల్లు వారి అబ్బాయి రేంజ్ ఎంత‌న్న‌ది ప్ర‌పంచానికి మ‌రో సారి చాటి చెప్పింది. ఇక ఆఖ‌రుగా కేజీఎఫ్ (చాప్ట‌ర్ 2) గురించి మాట్లాడుకోవాలి.. మొద‌టి రెండు మూడు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 4 వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్ల‌తో (గ్రాస్ క‌లెక్ష‌న్స్ డేటా) ప‌క్కా పైసా వ‌సూల్ సినిమా అనిపించుకుంది. దీంతో బాలీవుడ్ అదిరిపోతోంది. ఒక‌ప్పుడు సాంబారు క‌థ‌లు అని మ‌న‌ల్ని వెక్కిరించిన బీ టౌన్ బేబీస్ అండ్ మేక‌ర్స్ ఇప్పుడు ద‌క్షిణాది సినిమా స‌త్తాను చూసి అదిరిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news