తెలుగు హీరోల గురించి భూమిక ఏమందంటే..!!

-

టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు ఊహించని క్రేజ్ తెచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక నటించింది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతగా ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి వ్యవహరించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక స్టార్ హీరోల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి బెస్ట్ డాన్సర్ అని తెలియజేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫెంటాస్టిక్ డాన్సర్ అని తెలిపింది. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఇంటెలిజెంట్ నటుడు అని తెలిపింది. మహేష్ బాబు మాత్రం చాలా క్యూట్ అని తెలియజేసింది భూమిక. అలాగే సీనియర్ హీరో అయిన వెంకటేష్ కూడా స్పిరిచువల్ నటుడు అని తెలియజేసింది. భూమిక భర్త భరత్ ఠాకూర్ గురించి చెబుతూ తనకు తెలియకుండానే భరత్ తో ఎంగేజ్మెంట్ కి తమ కుటుంబ సభ్యులను పిలిచారని తెలియజేసింది భూమిక. తనకు ఏదో ఒక పని చెప్పి అలా బయటికి వెళ్లొచ్చే లోపు అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేసింది భూమిక.

ఇక ఎంగేజ్మెంట్ కి తమ ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చారని తెలియజేసింది. కుటుంబ సభ్యులను చూసి తను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని అలాగే భరత్ ఠాకూర్ అందరి మధ్యలో మోకాళ్ళ మీద కూర్చొని తనకు పెళ్లి ప్రపోజ్ చేయడం జరిగింది అని, అది చాలా రొమాంటిక్ గా అడిగారని భూమిక కామెంట్లు చేయడం జరిగింది. ఇక తన భర్త మూడ్ సరిగా లేకపోతే తను డాన్స్ చేస్తానని మంచి మ్యూజిక్ అందుకోసం పెడతారని తెలియజేసింది. భూమిక నటించిన చిత్రాలలో అనసూయ సినిమా అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఈ సినిమా చూసి తన భర్త కూడా ఒప్పుకున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news