Nagarjuna: బిగ్ బాస్ హౌజ్ నుంచి అతను ఔట్..ఊహించని ట్విస్టులు ప్లాన్ చేస్తున్న నాగార్జున?

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో ఎనిమిదో వారం ఎలిమినేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంది. ఈ వారంలో సింగిల్ లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలొస్తున్నాయి. కాగా, డెఫినెట్ గా సింగిల్ ఉంటుందని మరి కొందరు అంటున్నారు. అయితే, వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ వారం రోజుల పాటు ఉండి వెళ్లిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

ఇక బాబా భాస్కర్ నామినేషన్స్ లో లేకపోవడాన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా ఆయన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడనే చెప్పొచ్చు. నటరాజ్ మాస్టర్ కూడా ఎలిమినేషన్ జోన్ లో లేడు.కాగా, ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు అఖిల్, అజయ్, అనీల్, హమీద, అషు రెడ్డి. వీరిలో అషురెడ్డి, అఖిల్ సేఫ్ అని వార్తలొస్తున్నాయి. అఖిల్ కెప్టెన్ అయ్యాడు. దాంతో పాటు గేమ్ పైన ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిరువురు సేఫ్ అనే ప్రచారం సాగుతోంది.

అలా మిగతా వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది అనిల్, అజయ్, హమీదా. కాగా, హమీదకు బెస్ట్ పర్ఫార్మర్ అన్న పేరు వచ్చింది. బెస్ట్ ఇంటి సభ్యురాలిగా ఓట్లు కూడా బానే పడ్డాయి. ఇక మిగిలింది అనిల్, అజయ్ మాత్రమే. అజయ్ ని అఖిల్ పక్కన పెట్టిన నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజీలో తేడా వస్తున్నది. ఫలితంగా ఆటోమేటిక్ గా అజయ్ ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

హోస్ట్ నాగార్జున ‘బిగ్ బాస్’ సూచన మేరకు ఎవరూ ఊహించని విధంగా అనిల్, అజయ్ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..ఎవరు హౌజ్ ను వీడనున్నారు? అనేది తెలియాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version