ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి సినిమా కథలో దమ్ముంటే.. కంటెంట్ ఉంటే.. కథలో అవసరమైతే డ్యుయల్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు మన హీరోలు. అందుకే మన హీరోలు చేసే వైవిధ్యమైన రోల్స్ ఎంత కష్టంగా ఉంటాయి అంటే వాటి ద్వారానే వారు ఉన్నత స్థానానికి చేరుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.

ఒక వర్గం ప్రేక్షకులను చూస్తే కొంతమంది మాస్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు.. మరి కొంతమంది క్లాస్ సినిమాలను ఇష్టపడతారు.. ఫైనల్ గా ఏది ఏమైనా సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే.. సినిమాలు చూసే విధానంలో కూడా ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే రకమైన సినిమాలు చూడడానికి వారు కూడా ఇష్టపడరు. ఇప్పుడు డ్యూయల్ రోల్స్ ట్రెండ్గా మారింది. ఒకప్పుడు క్యారెక్టర్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేవారు హీరోలు.

ఇప్పుడు అలా కాకుండా డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కూడా డ్యూయల్ రోల్ అనే సెంటిమెంటును ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అఖండ సినిమాల్లో రెండు పాత్రలలో పోషించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇటీవల వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఇందులో కూడా బాలయ్య రెండు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసింది తాజాగా ఈ సినిమాలో కూడా ఈయన డ్యూయల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి కూడా బాలయ్యను ద్విపాత్రాభినయం చేపించే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ సినిమా ద్వారా బాలయ్యకు తన సెంటిమెంటు కలిసి వస్తుందో లేదో చూడాలి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?