వామ్మో.. శ్రీ లీలా క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 7 సినిమాలలో..!!

-

కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీలా పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అందుకుంది. తన అందంతో , నటనతో సెలెక్టివ్ పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ వరుసగా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్ తో పాటు తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. శ్రీ లీలా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేము అని… కేవలం నటనతో మాత్రమే వారిని ఆకట్టుకోవాలి అని అంటుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అయితే ఈమెకు ఆ రేంజ్ లో అవకాశాలు రావడానికి మాత్రం ఒక వ్యక్తి కారణమని తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీ లోకి రావడానికి కూడా ఆ వ్యక్తి కారణమట.. శ్రీ లీలా ను లైమ్ లైన్ లోకి తీసుకొచ్చింది కూడా ఆయనేనట. ఇక ఆయన ఎవరో కాదు దర్శక ధీరుడు రాఘవేంద్రరావు. ముఖ్యంగా ఆయన వల్లే ఆమె ఈ రేంజ్ లో అవకాశాలను అందుకుంటుంది అని సమాచారం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలా తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పింది. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీ లీలా.. అలాగే బాలయ్య, మహేష్ బాబు, శర్వానంద్, నితిన్ సినిమాలలో కూడా నటిస్తోంది.

ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో ఈ కుర్ర హీరోయిన్.. రవితేజ సరసన నటిస్తూ ఉండగా ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరొక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నదట. ఇక ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తోంది అని తెలియడంతో అభిమానులు సైతం ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి రవితేజకు ఈ హీరోయిన్ అయినా లక్కీ హీరోయిన్ గా మారుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news