పవన్ కల్యాణ్ సెట్‌లో అలా సిగ్గుపడేవాడు.. సీనియర్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలుగు సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు సీనియర్ నటి వై విజయ. ఇటీవల F3 సినిమాలో తన పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి పవన్ కల్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఉందని పేర్కొన్న వై.విజయ.. తాను ‘సుస్వాగతం’ చిత్రంలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. ‘సుస్వాగతం’ ఫిల్మ్ షూటింగ్ టైమ్ లో పవన్ కల్యాణ్ షాట్ కోసం రావడానికి సిగ్గుపడేవాడని, ఆయన ఇంత పెద్ద స్టార్ అవుతారని ఎక్స్ పెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు వై.విజయ.

పవన్ కల్యాణ్ చాలా చక్కటి ఆర్టిస్ట్ అని, తనను తాను బాగా డెవలప్ చేసుకున్నాడని పేర్కొంది విజయ. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఉన్నారని తెలిపింది వై.విజయ. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్ చాలా విభిన్నమైన పాత్రను పోషించారని ప్రశంసించింది.

ఈ తరం నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారని వివరించింది సీనియర్ నటి. వై.విజయ ..‘F2’,‘F3’ సినిమల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమాలతో పాటు ఇంకా పలు చిత్రాలలో వై.విజయ కీలక పాత్రలు పోషిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news