అవును.. వాటికి సర్జరీ చేయించానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!

-

సిడి ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అంటే కేవలం గ్లామర్ షో చేస్తే సరిపోదు అందుకు తగ్గట్టుగా బాడీ ఫిజిక్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది . అయితే కొంతమంది హీరోయిన్లు ఇప్పటికే బాడీ షేమింగ్ పై ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. మరికొంతమంది సర్జరీలు చేయించుకొని తమను తాము మరింత అందంగా మార్చుకున్నారు. అలాంటి వారిలో శ్రీదేవి నుంచి శృతిహాసన్ వరకు ఎంతోమంది సర్జరీలు చేయించుకుని తమ అందానికి మరింత మెరుగులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే కానీ ఈరోజు శృతిహాసన్ మరొక షాకింగ్ విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

శృతిహాసన్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకొని.. కెరియర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అని కూడా ముద్ర వేసుకుంది. ఇక ఆ ముద్రను చెరిపి వేయడానికి ఎంతో సమయం పట్టలేదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం సినిమాలో ఆమెకు అదృష్టం వరించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎవడు, బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో శృతిహాసన్ నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయిన శృతిహాసన్ మరొకవైపు తన వ్యక్తిగత విషయాల్లో కూడా బాగా పాపులారిటీ దక్కించుకుంది.

గతంలో మైకెల్ కోర్సులే అనే వ్యక్తితో డేటింగ్ చేసిన శృతిహాసన్ అతడితో విడిపోయి ప్రస్తుతం శాంతన్ హజారికా తో చట్టపట్టలేసుకొని తిరుగుతోంది. మరి కనీసం ఇతడితోనైనా పెళ్లి పీటల వరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది. ఇదిలా వుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్ తన బాడీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది . గత కొన్నేళ్లుగా శృతిహాసన్ ముక్కు విభిన్నంగా సన్నగా కనిపిస్తుంది. ఇక ఆమె ప్రారంభ చిత్రాల్లో ఉన్నట్లు ఇప్పుడు ముక్కు లేదు. దీంతో ఆమె అందం కోసం ముక్కుకు సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగింది. ఆమె ఇదే విషయంపై మాట్లాడుతూ.. అవును.. నా ముక్కుకు సర్జరీ చేయించుకున్నాను.. కానీ అందరికీ సంజయిసీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతా అనుకుంటున్నట్లు నేను అందం కోసం సర్జరీ చేయించుకోలేదు .. గాయం అయింది తప్పని పరిస్థితుల్లోనే సర్జరీ చేయించుకున్నాను అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news