యంగ్ హీరో శ్రీవిష్ణుకు అస్వస్థత..ఆస్పత్రిలో అత్యవసర చికిత్స..!

-

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల డెంగ్యూ బారిన పడిన శ్రీవిష్ణు రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ బాగా తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ బాగా నీరసించిపోయి అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులకు ఆస్పత్రికి తరలించారు.

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం శ్రీవిష్ణుకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వినికిడి. శ్రీవిష్ణు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. త్వరగానే ఆయన కోలుకుంటారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

శ్రీ విష్ణు ఇటీవల ‘భళా తందనాన’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘అల్లూరి’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా విష్ణు కనిపించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news