నందమూరి, మెగా రేర్ కాంబో RRR తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి రాజమౌళి అండ్ టీమ్ తీవ్రంగా కష్టపడుతుంది. కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవ్వడంతో ముందుగా అనుకున్న సమయానికి RRR Movie విడుదల చేయలేకపోయారు. ఇప్పడు ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఉక్రైన్ వెళ్తోంది.

ఆగష్టు 2 నుండి యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్, అలియా భట్‌లపై ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. పాటతో పాటు కొన్ని సన్నివేశాల రెండు వారాల పాటు షూటింగ్ చెయ్యనున్నారు. ఈ షెడ్యూల్ ముగిస్తే షూటింగ్ పార్ట్ పూర్తయినట్లేనట. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన రాజమౌళి ఇటీవలే 5 భాషల్లో ఐదుగురు సంగీత దర్శకులతో దోస్తీ పాటను కంపోజ్ చేయించారు. అనుదీప్, హేమ చంద్ర, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, నజీర్ ఆ పాటలో భాగస్వామ్యులయ్యారు. ఇక దోస్తీ పాటను ఆగస్టు 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు భారీ హైప్ ను పెంచేశాయి.
The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊
An @mmkeeravaani Musical.🎵
🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt
— RRR Movie (@RRRMovie) July 27, 2021