ప్రతి రోజు దీపం పెట్టకుంటే ఎన్ని అరిష్టాలో తెలుసా?

-

మనం ఉంటున్న ఇంటికి ఎంత అందంగా అలంకరిస్తామో..అంతకు మించి ఇంటిని లక్ష్మీ దేవి లాగా చాలా పవిత్రంగా చూసుకుంటున్నారు.. ఎప్పుడూ ఇల్లు సుఖ, సంతోషాలతో వర్దిల్లాలి అని శాంతి పూజలు, హొమాలు చేస్తున్నారు. ఇంకా గుడులు, గోపురాలు తిరిగి ప్రత్యేక పూజలు,వ్రతాలు చేస్తారు.కానీ కొన్ని ఆచార వ్యవహారాలను మాత్రం వదిలేస్తాం..అవే మన మెడకు చుట్టుకొని బాధలు, కుటుంబ కలహాలను కలిగిస్తాయని జోతిష్యపండితులు అంటున్నారు..

కొన్ని సూచనలు, సంకేతాలు గమనించి వాటిని దూరం చేసుకుంటే సుఖవంతమైన జీవనం సాధ్యమే. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొన్ని సంకేతాలు వివరించాడు. మన ఇంటిని దుష్టశక్తులు చుట్టుముట్టే క్రమంలో మనకు కనిపించే సంకేతాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నాడు.మన ఇంట్లో ఉండే తులసి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మన సంప్రదాయంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇది ఎండిపోతే మనకు ఏదో ఉపద్రవం వచ్చే అవకాశముందని తెలుసుకోవాలి.తులసి చెట్టును ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇంట్లో తరచూ గొడవలు జరగడం కూడా పెను ప్రమాదమే. రోజు ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో లక్ష్మిదేవి నివసించదు. దీంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ప్రశాంతత కోల్పోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో జరిగే అనర్థాలకు తార్కాణంగా నిలుస్తోంది. అందుకే ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త వహించడం మంచిదే..ఇంట్లో ప్రతి దినం దీపం వెలిగించకుంటే దినాము నష్టం కలుగుతుంది..ప్రతి ఇంట్లో రోజు పూజలు చేస్తూ మంచి పరిణామాలు చోటుచేసుకునేలా చేసుకోవచ్చు. మనకు నమ్మకం ఉన్నా.. లేకున్నా కూడా దీపం వెలిగించడం చేయాలి..అప్పుడు వేరే శక్తులు పోయి మంచి సుఖ సంతోషాలు కలుగుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news