తల్లిన చంపిన సాయితేజ దారుణ హత్య..

ఇటీవల హైదరాబాద్‌లో త‌ల్లిని చంపిన ద‌త్త‌పుత్రుడు త‌న స్నేహితుడి చేతిలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ నెల 7వ తేదీన దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో భూలక్ష్మి(52) అనే మ‌హిళ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. త‌ల్లి భూదేవిని ద‌త్త పుత్రుడు సాయితేజ త‌న ఫ్రెండ్ శివ‌తో క‌లిసి హ‌త్య చేశాడు. అనంత‌రం ఇంట్లో ఉన్న రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు, 35 తులాల బంగారం తీసుకొని ప‌రారీ అయ్యారు. అయితే.. న‌ల్ల‌మ‌ల్ల అడవుల్లోని మ‌ల్లెల‌తీర్థం వ‌ద్ద ఓ యువ‌కుడి మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, ప‌రిశీలించ‌గా సాయితేజ డెడ్ బాడీగా గుర్తించారు.

Andhra Pradesh: Dead body found in a parked car at Patamatalanka in  Vijayawada

సాయితేజ‌ను బండరాయితో మోది హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు గుర్తించిన పోలీసులు.. అనంత‌రం డెడ్ బాడీని మ‌ల్లెల‌తీర్థం నీటి గుండంలో ప‌డేశారు. అయితే సాయితేజ‌ను శివ‌నే చంపిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. శివ‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీశైలంకు వెళ్లి వస్తూ.. మల్లెల తీర్థం వద్ద సాయితేజ, శివ ఇద్దరూ మద్యం సేవించి.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సాయితేజను శివ హతమార్చినట్లు సమాచారం.