లక్ష్మీ దేవిని ఈ గవ్వలతో పూజిస్తే సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..

ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా ఒకటి.గవ్వలు, లక్ష్మిదేవి సముద్రం నుండి జన్మించారని నమ్ముతారు..తంత్ర శాస్త్రంలో.. గవ్వలను లక్ష్మీ దేవితో అనుసంధానించడం కనిపిస్తుంది. గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి.

గవ్వలతో అనేక రకాల నివారణలు కూడా చేయవచ్చు. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సుఖ శాంతి ఉంటుంది. ఈ గవ్వలను ఆవులను, ఇంటి అలంకరణకె కాదు.. అనేక ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. గవ్వలతో అమ్మవారిని ఎలా పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…శనివారం రోజున లక్ష్మీ దేవి చిత్రపటం ముందు పసుపు రంగు గవ్వలను ఉంచండి.ఈ పూజను సాయంత్రం చేస్తె చాలా మంచిది.పూజ చేసిన తర్వాత ఒక గవ్వను మీ పర్సులో ఉంచుకోవాలి..ఆ తర్వాత మరొక దానిని బీరువా లో ఉంచడం మంచిది. ఇక మిగిలిన గవ్వలను ఎరుపు క్లాత్ లో కట్టండి..ఇలా చెయ్యడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి.

ఉద్యోగులు పదోన్నతల కోసం..

ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో పురోగతి కోసం కూడా గవ్వలతో చిన్న చిన్న చర్యలు చేపట్టవచ్చు. ఆలయంలో 11 గవ్వలను సమర్పించండి. ఒక ఎర్రటి క్లాత్ లో 7 గవ్వలను కట్టి, ఇంటర్వ్యూ సమయంలో వాటిని మీతో తీసుకెళ్లండి. ఇది విజయానికి దారి తీస్తుంది.

కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో 21 గవ్వలను వేయండి. దీంతో ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభం పొందాలనుకుంటే, మీ బీరువాలో 7 గవ్వలను ఉంచండి. ఉదయం,సాయంత్రం వాటిని పూజించండి. ఇది వ్యాపారంలో పురోగతిని తెస్తుంది.

11 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూలతని తెలుస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

శ్రావణ మాసంలో 11 గవ్వలను తీసుకొని ఒక పసుపు గుడ్డ లో కట్టి ఎవరికీ కనిపించకుండా ఉత్తర దిక్కున పెట్టాలి..కుబేరునికి సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

అంతేకాదు.. శుక్రవారం పసుపు కలిపిన నీటిలో కొన్ని తెల్లని గవ్వలను నానబెట్టండి. అనంతరం వాటిని ఎరుపు రంగు బట్టలో కట్టాలి..ఇలా చెయ్యడం వల్ల మంచి లాభాలను పొందుతారు.