మహిళ కంట్లో బతికున్న తేనెటీగలు.. ఆమె కన్నీళ్లే వాటికి ఆహారం.. వీడియో

-

నేను ముందుగా సాధారణంగా చెక్ చేశా. అప్పుడు ఆమె కన్ను లోపల ఏవో పురుగుల కాళ్లు కనిపించాయి. తర్వాత మైక్రోస్కోప్ తో పరిశీలించా. అప్పుడు నాలుగు తేనెటీగలు కదులుతూ కనిపించాయి.

టైటిల్ చూసి షాక్ అయి ఉంటారు. ఎందుకంటే… మహిళ కంట్లోకి తేనెటీగలు దూరడం అనేది ఓ వింత. అటువంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. ఇదే మొదటి సారి. కంట్లో నలత పడటం కామన్. ఏదైనా దుమ్మూ దూళి పడటం కామన్. కానీ.. బతికున్న తేనెటీగలు మహిళ కంట్లోకి దూరం అనేది అన్ కామన్. అసలు అది సాధ్యమవుతుందా? అనే సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. అది సాధ్యం అవుతుంది అని చెప్పే ఘటనే ఇది.

తైవాన్ కు చెందిన ఓ మహిళ కన్నను ఉన్నట్టుండి వాచింది. దీంతో వెంటనే కంటి స్పెషలిస్టు దగ్గరికి వెళ్లింది. ఆమె కంటిని పరీక్షించిన ఫూయిన్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు ఆమె కంటిలో బతికున్న తేనెటీగలు ఉన్నట్టు గుర్తించారు.

నేను ముందుగా సాధారణంగా చెక్ చేశా. అప్పుడు ఆమె కన్ను లోపల ఏవో పురుగుల కాళ్లు కనిపించాయి. తర్వాత మైక్రోస్కోప్ తో పరిశీలించా. అప్పుడు నాలుగు తేనెటీగలు కదులుతూ కనిపించాయి. అంతే నేను షాక్ అయ్యా. బహుశా.. అవి తన కన్నీటిని తాగుతూ అక్కడే తిష్ట వేసి ఉండొచ్చు. అయితే.. అవి తన కన్ను గుడ్డుకు ఎటువంటి హానీ తలపెట్టలేదు. నెమ్మెదిగా వాటిని నేను తన కంట్లో నుంచి తొలగించా.. తన కంటి చూపు మెరుగయింది.. అంటూ తెలిపాడు ఆ మహిళకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్.



అయితే.. ఆ మహిళ కంట్లోకి తేనెటీగలు ఎలా దూరాయో.. ఆ మహిళనే అడుగుదాం పదండి.. నేను నా గార్డెన్ ఏరియాలో పని చేస్తుండగా… కంట్లో ఏదో నలుసు పడినట్లు అనిపించింది. దీంతో నా కన్నును నేను కాసేపు నలిపాను. తర్వాత నా కళ్లను నీటితో శుభ్రం చేసుకున్నా. తెల్లారి నుంచి నా కన్ను ఉబ్బడం ప్రారంభించింది. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే అప్పుడు తెలిసింది నా కంట్లో తేనెటీగలు దూరాయని.. అని చెప్పింది ఆ మహిళ.

Read more RELATED
Recommended to you

Latest news