ఈ రోజుల్లో యువత ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంకొతమంది అయితే..పెళ్లికి ముందే డేటింగ్ లో ఉంటున్నారు. అలా ఉండటం తప్పేం కాదు, ఒకరినొకరు అర్థంచేసుకోవాటిని మాత్రమే ఇలా చేస్తుంటారు అని కొందరు అభిప్రాయపడుతుంటారు. డేటింగ్ అయినా, ప్రేమ అయినా, పెళ్లి అయినా ఆ జంటలో ఒకవేళ వయసు తేడా ఉంటే కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయకుడదు..అసలు ఫస్ట్ ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశం గురంచి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆధిపత్యం
అదేంటో తెలియదు కానీ..మనకంటే పెద్దవాళ్లు మనమీద ఆటోమెటిక్ గా కొంచెం ఆధిపత్యం చూపిస్తుంటారు. ఇంట్లో చెల్లి మీద అన్న. తమ్ముడు మీద అక్క ఒక టైప్ పెత్తనం చేస్తుంటారు కదా. అలా చిన్నవాళ్లకే అనిపిస్తుంది. పెద్దవాళ్లు ఏదో మన తమ్ముడు, చెల్లే కదా అని కొంచెం ఎక్కువగా కేర్ తీసుకునే ప్రయత్నంలో మనకు అది ఆధిపత్యం అనే భావన ఏర్పడుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరిలో వయసులో పెద్దవాళ్లు ఒక్కోసారి చిన్నవాళ్లపై ఆధిపత్యం చూపించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చిన్నవాళ్లు తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల క్రమంగా తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం పోతుంది. ఇది అస్సలు మంచిదే కాదు. తమ భావాలను స్వతంత్రంగా చెప్పగలిగినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుందనే విషయం మర్చిపోకండి. కాబట్టి మీరు పెద్దవారైతే.. మీ పాట్నర్ వయసుకు తగ్గట్టుగా ఆలోచించిస్తే వారికి త్వరగా దగ్గర అవ్వొచ్చు. వాళ్లును కూడా బాగా అర్థంచేసుకోవచ్చు.
పరిణతి స్థాయిలో తేడా
రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరికీ వయసు పరంగా తేడా ఉండడం వల్ల.. వాళ్ల ఆలోచనా విధానం, పరిణతి స్థాయిలలో కూడా తేడా ఉండడం కచ్చితంగా ఉంటుంది. ఇది అభిప్రాయా భేదాలు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి దృష్టికోణాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. అలాంటి పరిస్థితుల్లో నా మాటే నెగ్గాలనే ధోరణిలో కాకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకుని మెలిగితే..దాదాపు ఎలాంటి గొడవలు రావు.
ఫ్రెండ్స్ లో కూడా తేడా ఉంటుంది.
మన ఫ్రెండ్స్ కూడా మన ఏజ్ వాళ్లే ఉంటారు. కాబట్టి ఆటోమెటిగ్గా వయసు ఎక్కువ ఉన్నవారి ఫ్రెండ్స్ కూడా మీ పాట్నర్ వయసుకుంటే పెద్దవాళ్లే అవుతారు. సో మీ భాగస్వామి ఫ్రెండ్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఏజ్ తేడా ఉంటుంది. ఇక వీకెండ్ లో స్నేహితులను కలిసే విషయంలో మీ ఆలోచనల మధ్య తేడా ఉంటుంది. ఈ పెద్దోళ్లు ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్దాం అంటే..ఇంకోకరు పబ్ కు వెళ్దామనే టైప్ లో ఉంటారు. ఎప్పుడూ ఒకరి నిర్ణయమే కాకుండా మీ భాగస్వామి నిర్ణయాన్ని కూడా పాటిస్తూ ఉండాలి.
గొడవలు ఇక్కడే వస్తాయి..
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇద్దరి మధ్య గొడవలు రావడం చాలా కామన్. కానీ.. తమ మధ్య వచ్చే అభిప్రాయభేదాలకు వయసు తేడా మాత్రమే కారణమని అనుకోవడం కరెక్టుకాదు. వయసు పరంగా తేడా ఉన్నవాళ్లు రిలేషన్‌షిప్లో ఉండడం కష్టమని ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అలా ఎందుకు జరిగిందో ఆలోచించి.. మరోసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేతప్ప గొడవ జరిగిన ప్రతిసారీ వయసు తేడాను నిందించడం సమస్యకు పరిష్కారం కాదు..!
అయితే వయసు ఇక్కడ బాగా ముఖ్యమే..
లైంగిక విషయాలకు సంబంధించి వయసు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఉండే లైంగిక ఆలోచనలు ఒక్కో వయసులో ఒక్కోలా ఉంటాయి అనే విషయం మనందరికి తెలిసిందే. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ల మధ్య వయసు విషయంలో తేడా ఉన్నప్పుడు.. తమ లైంగిక ఆలోచనల్లో కూడా తేడా బరాబర్ ఉంటుంది. అందుకే తమ మనసులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటే.. ఇద్దరి ఆలోచనల మధ్య సఖ్యత కుదురుతుంది.
మీ ఇద్దరు ఆలోచనా విధానం, పాటించే విలువలు ఒకేలా ఉన్నప్పుడు వయసు తేడా సమస్య ఎప్పటికి రాదు. ఏకాభిప్రాయంతో ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడిపుతున్న వాళ్లు ఉన్నారు.