ప్రతీ ఒక్కరూ లవ్ చేస్తారు. ప్రేమ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. వాళ్ళ రిలేషన్ షిప్ స్టేటస్ ఎలా ఉన్నా వాళ్ల జీవితంలో అత్యంత అందమైన లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ లవ్ స్టోరీ ఇంకా కొనసాగుతున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్లే వారి లవ్ స్టోరీకి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అలాంటి తప్పుల్లో కొన్నింటిని చూసుకుంటే, ఫ్రెండ్స్ తో తమ లవ్ గురించి చెప్పకూడని విషయాలు చెప్పడం.
అవును, రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ మధ్య జరిగే విషయాలు కొన్ని ఫ్రెండ్స్ తో చెప్పకూడదు. దానివల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ భాగస్వామికి తెలియని విషయాలు
మీ భాగస్వామికి చెప్పని విషయాలు, ముఖ్యంగా మీ భాగస్వామి గురించి గానీ, లేక ఇంట్లో జరిగిన సంఘటనల గురించి గానీ మీ భాగస్వామికి చెప్పకుండా, మీ ఫ్రెండ్స్ తో పంచుకోవద్దు. దీనివల్ల ఒక్కోసారి మీపై జోకులు పేల్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని సార్లు సీరియస్ అయ్యే అవకాశమూ ఉంది. అందుకే ముందుగా మీ భాగస్వామికి చెప్పండి.
వ్యక్తిగత విషయాలు
ప్రైవేటు ఫోటోలు గానీ, ఇతర వ్యక్తిగత సంబంధిత విషయాలు గానీ ఫ్రెండ్స్ తో పంచుకోవద్దు. అలాంటి వాటిని అవాయిడ్ చేయడమే మంచిది. అవి కేవలం మీకు మాత్రమే తెలియాలి. మీ ఇద్దరికీ మాత్రమే తెలిసి ఉండాలి.
గతం
మీ భాగస్వామి గతం గురించి మాట్లాడవద్దు. అప్పుడలా, ఇప్పుడలా అని చెప్పి అనవసరంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు.
శృంగార జీవితం
శృంగార జీవితానికి సంబంధించిన విషయాలు ఫ్రెండ్స్ తో అస్సలు డిస్కస్ చేయవద్దు. మీకు ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నిపుణులను కనుక్కోవడం మంచిది.