పాక్ గెలిచిందని సంబరాలు చేసుకుంది.. తర్వాత కటకటాల పాలైంది. రాజస్థాన్ లో స్కూల్ టీచర్ నిర్వాకం

టీ 20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిందని సగటు భారతీయుడు బాధపడుతుంటే, మరికొంత మంది మాత్రం అందుకు వ్యతిరేఖంగా సంబరాలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేశభక్తి లేకుండా పరాయి దేశపు గెలుపును సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగింది. పాకిస్థాన్ గెలుపు అనంతరం నఫీసా అత్తారి అనే స్కూల్ టీచర్ ఆ జట్టుకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ’ మనం గెలిచాం‘ అంటూ సంబరాలు చేసుకుంటన్న ఫోటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంది. 

ఇలా నఫీసా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో ఆమె చర్య పట్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నఫీసా స్థానికంగా ఉండే నీర్జా మోడీ ప్రైవేటు స్కూలులో టీచర్ గా పనిచేస్తుంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందటంతో ఉదయ్ పూర్ లోని అంబమట పోలీసులు విచారణ ప్రారంభించారు. నఫీసా ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, వైద్యపరీక్షలకు తరలించి, ఆ తరువాత అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు నీర్జామోదీ ప్రైవేటు స్కూలుకు వెళ్లి త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి, జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ ఉదంతంపై స్కూలు యాజమాన్యం స్పందించి. సదురు టీచర్ ను విద్యాలయం నుంచి తొలగించారు. అంబమట పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ దల్పత్ సింగ్ ప్రకారం సదురు స్కూల్ టీచర్ ను ఐపీసీ 153 బీ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు.