అవతలి వారి మీద ప్రేమని చెప్పలేక సతమతమవుతున్నారని చెప్పడానికి సంకేతాలు..

ప్రేమని ప్రకటించాలి. అలా అయితేనే అవతలి వారికి తెలుస్తుంది. అలా కాదు వాళ్ళే తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కుదరని పని. ఎందుకంటే ఎవ్వరైనా అవతలి వారి మనసులో ఏముందో ఒక అంచనాకి రాలేరు. కానీ తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని గుర్తించగలరు. అది చెప్పలేకపోతున్నారని గ్రహించగలరు. అలా అని వాళ్ళు కూడా బయటపడరు. ఒకరి మీద ప్రేమని బయటకు చెప్పలేకపోతున్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఇక్కడ చూద్దాం.

ఒక విషయం చెప్పాలని పిలిచి, దాని గురించి మాట్లాడకుండా అవసరం లేని చిన్న చిన్న విషయాలు మాట్లాడడం. ఆ సమయంలో తడబడడం అవతలి వారికి సులభంగా తెలుస్తాయి. చెప్పాలా వద్దా అన్న సంధిగ్ధంలో మాటలు రాకపోవడం తెలిసిపోతుంది.

ఇంకా చెప్పాలనుకున్న విషయాన్ని మాటల ద్వారా చెప్పకుండా బహుమతులు అందించడం. న్యూ ఇయర్ కో, లేదా మరో సరికొత్త రోజుకీ బహుమతి అందిస్తుంటే, ఫీలింగ్స్ బయటపెట్టలేకపోతున్నారనే అర్థం. బహుమతి తీసుకుంటే తనకీ ఫీలింగ్స్ ఉన్నాయన్న నిర్ధారణకి వచ్చాక చెప్పాలని చూస్తారు.

ఫోన్ కి ఏదో ఒక అవసరం లేని మెసేజ్ పంపి, ఎలాంటి సమాధానం వస్తుందో అని ఎదురుచూడడం. ఉదాహరణకి నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని పంపి, దానికి ఏ సమాధానం వస్తుందో చూస్తారు. అవతలి వాళ్ళు దాని మీద స్పందించే తీరుని బట్టి ఆ మెసేజ్ పొరపాటున వచ్చిందనో, లేక అరెరే వేరే వాళ్ళకి పంపాననో ఏదో ఒకటి చెబుతుంటారు. ఇలా మాట్లాడుతున్నారంటే వారు ఖచ్చితంగా మీ మీద ఫీలింగ్స్ తో ఉన్నట్టే. ఇలాంటి సంకేతాలు మీ స్నేహితుల్లో కనిపిస్తే ఒక్కసారి ఆలోచించుకోండి.