వాస్తు: మీ కెరీర్ బాగుండాలంటే వీటిని పాటించండి..!

మీ కెరీర్ లో విజయం సాధించాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ వాస్తు చిట్కాలు పాటించండి. పండితులు చెబుతున్న ఈ పద్ధతులను పాటిస్తే ఖచ్చితంగా మీ కెరీర్ లో విజయాన్ని పొందగలరు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం మనంఇప్పుడే పూర్తిగా చూసేద్దాం. ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా విజయం పొందొచ్చు.

ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులని ఉపయోగించేటప్పుడు ఆగ్నేయం వైపు ఉంచితే మంచిది. దీంతో మీకు మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.
అదే విధంగా కుర్చీలో కూర్చుని పని చేస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటే మానేయాలి.
అలానే హై బ్యాక్ చైర్ ని ప్రిఫర్ చేయడం వల్ల కెరీర్ బాగుంటుందని మంచి సక్సెస్ పొందొచ్చని అంటున్నారు పండితులు.
వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు గుండ్రంగా ఉండే టేబుల్స్ ని వాడొద్దు.
అలానే మీరు పని చేసే టేబుల్ మీద బాంబు ప్లాంట్ ని పెట్టుకోవడం వల్ల కూడా మీకు శుభ ఫలితం పొందచ్చు. పనిని కూడా బాగా అయ్యేలా చేస్తుంది.
ఉత్తరం వైపు కూర్చుని పని చేయడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు. అదే విధంగా మానసికంగా కూడా సమస్యలు ఉండవు.
మీరు పని చేసేటప్పుడు మీరు మీ వెనకాల కిటికీ ఉండేటట్టు కూర్చుంటే ఆస్తమాను ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వేరే వైపు కూర్చోండి. ఈ విధంగా పండితులు చెబుతున్న చిట్కాలను పాటించి మీ కెరీర్ ని డెవలప్ చేసుకోండి. సమస్యల నుండి బయట పడి ఇబ్బందులు ఏమి లేకుండా ఆనందంగా వుండండి.