హనుమంతుడు,సింధూరం వెనుక ఉన్న అసలు కథ ఇదే..

-

ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది..అయితే మామూలుగా మనం ఏదైనా గుడికి వెళితే అక్కడ పసుపు లేదా కుంకుమ దేవుళ్లకు పెడుతూ ఉంటారు.అది మిగితా దేవుళ్లకు..కానీ ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరాన్ని మాత్రమే పెడతారు.మరి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం అన్న విషయానికి వస్తే.. ఒకసారి సీతమ్మ తల్లి ఆంజనేయుడు చూసి వెంటనే సీతమ్మని అడుగుతూ ఎందుకమ్మా సింధూరాన్ని ధరిస్తున్నావు అని అడగగా వెంటనే సీతమ్మ తల్లి ఏం చెప్పాలో తోచక వెంటనే రామచంద్రుడికి మేలు కలుగుతుంది అని చెప్పిందట..

రామయ్య కు మేలు జరుగుతుంది అనే మాట ఆంజినెయ స్వామికి నచ్చడంతో మొదటి రోజు తన శరీరం మొత్తం సింధూరం పూసుకొని సభకు వెళ్లాడట. అప్పుడు అక్కడ వారు ఎందుకు ఇలా కొంచెం ఎండా సింధూరం పూసుకున్నావు అడగగా సీతమ్మ తల్లి చెప్పే సమాధానం చెప్పారట ఆంజనేయులు. ఆంజనేయ స్వామికి భక్తికి పరవశుడే ఒక వరం ఇస్తూ నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను అని శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి మాట ఇస్తాడు.

ఇక అప్పటినుంచి ప్రతి మంగళవారం సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఒంటికి పూసి ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించిన తర్వాత నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రమాన్ని పూజిస్తూ ఉంటారు. సింధూర పూజ అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైనది. అందులోనూ మంగళవారం రోజు సింధూరం పూజ అంటే మరీ మరీ ఇష్టపడుతూ ఉంటారు..ఇది అసలు కథ..అందుకే ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం ఉంటుంది..ఇకపోతే తమలపాకులు అన్నా కూడా స్వామికి చాలా ఇష్టం.. అందుకే కోరికలు కోరుకున్న వారు ఆకు పూజను చేయిస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news