వాస్తు : ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఆయితే ఇలా చేస్తే సరి..!

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం ఎలాంటి సమస్యలనైనా సరే మనం తొలగించొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏ బాధ ఉండదు నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి వాటి కోసం చూద్దాం.

చాలా మంది ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు ఉద్యోగం లేని వారు ఇలా ప్రయత్నం చేయండి. అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండచ్చు. మంచి ఉద్యోగం రావాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయని పండితులు అంటున్నారు. పసుపు లేదా బియ్యం టిప్స్ బాగా ఉపయోగపడతాయి. తెలుపు రంగు బియ్యం నలుపు రంగు బియ్యం కూడా ఉద్యోగాన్ని పొందేందుకు సహాయపడతాయి.

అక్షితలని కూడా మీరు ఉపయోగించవచ్చు. చాలా రోజుల నుండి ఉద్యోగం కోసం చూసి ఉద్యోగం రాలేదంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది మంచి ఉద్యోగాన్ని చాలా కాలం నుండి పొందలేకపోతున్నట్లయితే శని దేవుడు ఆలయానికి శనివారం నాడు వెళ్లి నల్ల బియ్యం ఆవాల నూనె శని దేవుడికి ఇవ్వండి. శనిదేవుడు మంత్రాన్ని కూడా జపించండి ఇలా చేయడం వలన త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుంది. అలానే చాలా కాలం నుండి ఏదైనా పని పూర్తి అవ్వకపోయినట్లయితే హనుమంతుడిని పెట్టి హనుమంతుడి దగ్గర బియ్యాన్ని ఉంచండి. ఫోటో వెనక ఈ బియ్యం దాచిపెట్టి ఉంచాలి ఇలా ఉంచడం వలన అనుకున్న పని పూర్తి అవుతుంది.