వాస్తు: ఆనందంగా ఉండాలన్నా కుదరడం లేదా..? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసం..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పారు.

నిజానికి ప్రతీ ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటూ వుంటారు. అందుకోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వుంటారు. మీరు కూడా ఆనందంగా ఉండాలన్నా కుదరడం లేదా..? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆనందంగా ఉండాలంటే ఇలా ప్రతి ఒక్కరు అనుసరించాలి. ఆనందంగా ఉండాలనుకునే వారు ఉప్పుని ఈ విధంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లల్లో కాస్త సాల్ట్ ని వేయండి. ఉప్పునైనా వేసుకోవచ్చు. ఇలా మీరు ఇంటిని శుభ్రం చేస్తే కచ్చితంగా ఇంట్లో సమస్యలు అన్ని దూరం అయిపోతాయి.
నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఒక గాజు కప్పులో ఉప్పు వేసి బాత్రూం లో ఉంచండి ఇది చెడుని తొలగించి మంచిని కలిగిస్తుంది.
పిల్లలకి సంబంధించి సమస్యలు ఏమైనా పోవాలి అంటే కచ్చితంగా పిల్లలు స్నానం చేసే నీళ్ల లో కొంచెం సాల్ట్ వేయండి. చిటికెడు ఉప్పు వాళ్ళు స్నానం చేసే నీళ్లలో వేయడం వలన ఎలర్జీలు రావు. అలానే ఆనందంగా ఉండేందుకు అవుతుంది. పాజిటివిటీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఉప్పుని ఉపయోగించవచ్చు. ఇటువంటి సమస్యలతో బాధ పడే వాళ్ళు ఒక చోట ఉంచుకుంటే కచ్చితంగా పాజిటివిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news