వాస్తు: ఇంట్లో ప్రశాంతంగా ఇబ్బందులేమీ లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఇంట్లో ప్రశాంతంగా ఇబ్బందులేమీ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్పారు. మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చెప్పారు. వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

 

వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారానికి నలుపు రంగు ఉండకూడదు. ఇంటి గేటు కి కూడా నలుపు రంగు ఉండకూడదు. దీని వలన ఇబ్బందులు వస్తాయి.

అలానే ఇంటి ముఖద్వారం తలుపు ఎప్పుడు దక్షిణ దిశగా తెరిచేటట్టు ఉండాలి.

అలానే ఇంట్లో ఉండే నెగటివ్ ని తొలగించుకోవడానికి కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది. దాల్చిన ని కూడా ఉపయోగించవచ్చు.

కొన్ని బిర్యానీ ఆకులని వెలిగించి ఇంట్లో పొగ వేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి చెత్తాచెదారం ఎక్కువగా ఉండకూడదు. విరిగిపోయిన పగిలిపోయిన సామాన్లు ని ఉపయోగించడం వలన కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ తప్పు కూడా చేయొద్దు.

పూజ గది ఇంట్లో ఉండడం కూడా చాలా ముఖ్యం పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి.
వాస్తు దోషాలను తొలగించడానికి నెమలిక కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నెమలికని ఇంట్లో ఉంచండి.

ఇంట్లో గార్డెన్ ఎప్పుడు అందంగా శుభ్రంగా ఉండాలి. దీనివలన ఉదయం మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంట్లో గోల్డ్ ఫిష్, ఫౌంటెన్ వంటివి ఉంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరి ఈ విధంగా అనుసరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండండి.