వాస్తు: ఆగ్నేయ దిశల్లో గోడలకు పసుపు రంగు వేయడం వల్ల తల్లికి హాని

-

ఇళ్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు.. ఎంతో కష్టపడితే కానీ మనం ఒక సొంతగూటిని నిర్మించుకోలేం.. అలా కట్టుకున్న ఇళ్లు సంతోషాల నిలయంగా ఉండాలి కానీ..ఎప్పుడు చికాకులు, గొడవలు, నష్టాలతో ఉండొద్దు.. అలా ఉండొద్దంటే.. ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. చాలామంది వాస్తు అంటే ఏ దిక్కున ఏవి ఉండాలో చూసుకుంటారు..ఎన్ని గడపలు ఉండాలి, ఈశాన్యంలో మోటర్ పెట్టామా అంటే సరిపోదు.. వాస్తు నిర్మాణాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వివరిస్తుంది. గోడలకు వేసే రంగుల గురించి కూడా వాస్తు శాస్త్రంలో క్లియర్‌గా చెప్పారు.

వాస్తు శాస్త్రంలో దిశలతో పాటు రంగులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. పచ్చని పసుపు రంగు చాలా శుభప్రదమైందిగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్శిస్తుందని అంటారు. దీని వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నిలిచి ఉంటాయి. వాస్తు ప్రకారం పని చేసుకునే చోట పసుపు రంగు వేసుకోవడం వల్ల జీవితంలో మంచి పురోగతి ఉంటుందని భావిస్తారు.

వాస్తు ప్రకారం పడకగదిలో గోడలకు పసుపు రంగు వెస్తే దంపతుల మధ్య అనుబంధం మరింత మధురంగా మారుతుంది. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది.
ఆగ్నేయ దిక్కున పసుపు రంగు వేయడం వల్ల ఈ రంగు సంబంధించిన దిక్కుల తత్వాలకు హాని జరగవచ్చు. ఆగ్నేయ దిశల్లో పసుపు రంగు వేయడం వల్ల తల్లికి హాని కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
ఈశాన్యానికి కూడా ఈ రంగు పనికి రాదు.
పసుపుతో పాటు ఎరుపు రంగు వాడకపోవడమే మంచిది.
ప్రతి దిశకు నిర్దిష్ట రంగు వేసుకోవాలని వాస్తు వివరిస్తోంది. అయితే అలాంటి నియమాలు అందరికీ సరిపడకపోవచ్చు. వాస్తు ప్రకారం రంగులకు సాధారణ మార్గదర్శకాలకు కట్టుబడడం మంచిది.

ఈశాన్యం – లేత నీలం
తూర్పు – తెలుపు లేదా నీలం
ఆగ్నేయం – ఈదిక్కు శక్తి కేంద్రం కనుక ఆరెంజ్, గులాబి లేదా వెండి రంగులు మంచిది
ఉత్తరం – ఆకుపచ్చ, పిస్తారంగు
వాయవ్యం – ఇది గాలికి సంబంధించింది. కనుక తెలుపు, బూడిద, క్రీమ్ కలర్స్ మంచిది
పడమర – ఇది నీటికి సంబంధించింది. నీలం, తెలుపు మంచిది.
నైరుతి – పీచ్, మట్టి రంగు, లేదా బిస్కట్ రంగు లేదా లేత గోధుమ రంగు
దక్షిణం – ఎరుపు లేదా పసుపు రంగులు వేసుకోవడం మంచిది.
ఎప్పుడైనా ఇంటికి లేత రంగులు వేయడం ఉత్తమం.. ఎరుపు, గోధుమ, బూడిద, నలుపు వంటి రంగులు అందరికీ సరిపడకపోవచ్చు. ఈ ముదురు రంగులు మండుతున్న రాహు, శని, మార్స్, సూర్యుడికి ప్రతీకలు. వీటి వల్ల అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు రంగులు ఇంట్లోని శక్తి ప్రవాహానికి భంగం కలిగించవచ్చు. కనుక వీటిలో లేత షేడ్స్ ఎంచుకోవడం మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

చాలా మంది వారికి నచ్చిన రంగులను ఎంచుకోని ఇంటికికి పేయింటింగ్‌ చేసుకుంటారు. అది మంచిదే..కానీ మరీ ఎబ్బెట్టుగా కాకుండా.. డీసెంట్‌గా ఉండేలా చూసుకుంటే. .ఇంట్లోకి రాగానే మనసుకు హాయిగా ఉంటుంది. !

Read more RELATED
Recommended to you

Latest news