మనం ఎంత కరెక్టుగా ఉన్నా సరే.. వాస్తు అనుకూలించకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ప్రతి గృహిణికి కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. వంటగదికి సంబంధించి కొన్ని వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి అంటారు. అవి వెలితిగా ఉంటే ఇంట్లో ధనం కూడా వెలితిగా ఉంటుందని పండితులు చెప్పే మాట. చిన్న చిన్న విషయాలే మీ ఆర్థిక పరిస్థితి బాగా ప్రభావం చూపిస్తాయి. వాస్తులో చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు.
వాస్తు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో ధాన్యం ఎప్పటికీ నిండుకోకూడదు. ఇంట్లో తిండి గింజలు అయిపోవడం ప్రతికూలతలకు సంకేతం. అంతేకాదు అవమానకరం అని వాస్తు అభివర్ణిస్తోంది. ముఖ్యంగా బియ్యం, గోధుమల వంటి ధాన్యం ఎప్పటికీ అయిపోవద్దు. ఈ జాగ్రత్త అన్నపూర్ణా దేవిని ప్రసన్నం చేస్తుంది.
ఇంట్లో నీళ్లు నింపి పెట్టుకునే కుండ, బాత్రూమ్‌లో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. నీటి పాత్రలు ఖాళీగా ఉంచితే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పేదరికం ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. ఇంటి పరువు ప్రతిష్టలు కూడా ప్రమాదంలో పడొచ్చు. కనుక నీటి పాత్రలను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఈ జాగ్రత్త తప్పక పాటించాలి. నీరు నింపిపెట్టుకునే పాత్ర విరిగిపోయి లేదా రంధ్రాలతో ఉండకూడదు. నీటి వృధా చేస్తే ఇంట్లో లక్ష్మీ నిలవదు. నీరు వృథా చేస్తే డబ్బు కూడా మీ దగ్గర అలాగే ఖర్చవుతుంది.
మీ ఇంట్లో డబ్బు దాచుకునే తిజోరి లేదా మీ పాకెట్‌లో ఉండే పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అందులో కొంత డబ్బు ఎప్పటికీ ఉంచాలి. పర్స్ లేదా తిజోరిలో తప్పకుండా కొంత డబ్బు ఉంచుకోవాలి. ఖాళీ పర్సు లేదా తిజోరి అపశకునంగా భావిస్తారు. ఖాళీ పర్సు దరిద్రానికి సంకేతం. లక్ష్మి దేవికి కోపం తెప్పిస్తుంది. ఇంట్లో డబ్బుదాచుకునే బీరువా లేదా తిజోరిలో గోమతీ చక్రం, నాణేం, శంఖం ఉంచుకోవడం శుభప్రదం.
ఇంట్లో పూజకు వినియోగించిన పూలు వాడిపోయినా కూడా తీసెయ్యకుండా కొంతమంది అలాగే ఉంచుతారు. ఎట్టిపరిస్థితుల్లో దేవుడికి అలంకరించిన పూలు తెల్లవారి తప్పనిసరిగా తీసెయ్యాలి.