వాస్తు: ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే.. సిరులు కురుస్తాయట..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పూల మొక్కకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. ఈ పూల మొక్క కనుక ఇంట్లో ఉంటే సిరులు కురుస్తాయట.

వాస్తు ప్రకారం ఇంట్లో అపరాజిత మొక్క ఉంటే చాలా మంచిది ఈ మొక్కని శంఖు మొక్క అని కూడా అంటారు. ఈ పూలు నీలం రంగులో తెలుపు రంగులో ఉంటాయి. ఈ పూల మొక్కలని కృష్ణకాంత విష్ణుకాంత అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఈ పూలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందట ఇవి లక్ష్మీదేవికి ఇష్టం కనుక ఆదాయం విషయంలో ఎలాంటి లోటు ఉండదు అని వాస్తు పండితులు అంటున్నారు కాబట్టి పండితులు చెప్పినట్లుగా అనుసరిస్తే మంచిది. ఈ పులని శని దేవుడికి పెడితే కూడా చాలా మంచి కలుగుతుంది. శని దోషాల నుండి బయటపడొచ్చు.

ఈ పూల మొక్కని ఇంట్లో పెంచడం వలన ఇంట్లో శాంతి ఉంటుంది అలానే ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కుటుంబ సభ్యుల మేధస్సు తెలివితేటలు కూడా ఈ పూలు పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి కచ్చితంగా మీ ఇంట్లో ఈ మొక్కని ఉంచేలా చూసుకోండి. అప్పుడు సమస్యల నుండి బయటపడవచ్చు ఆనందంగా ఉండేందుకు కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news