వాస్తు: వీటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి… లేదంటే సమస్యలే..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యనైనా మనం తరిమికొట్టొచ్చు. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి వాటిని అనుసరించడం వలన మంచి కలుగుతుంది..? ఇబ్బందులేమీ లేకుండా ఎలా ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం.

మన ఇంట్లో ప్రతిదీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అస్సలు రాదు. నెగటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ శుభ్రత పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే కొన్ని వస్తువుల్ని మాత్రం కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.

అక్వేరియం లేదా నీటికి సంబంధించినవి ఏది కూడా శుభ్రంగా లేకుండా ఉండకూడదు. అలానే అక్వేరియం లేదా నీటి కి సంబంధించినది దక్షిణ దిశలో ఉంచితే మంచిది. దీంతో తక్కువ ఖర్చులు అవుతాయి. అలానే ఇంట్లో డబ్బులు కూడా ఉంటాయి.

అలానే ఇంటి యొక్క తలుపులు గోడలు ఫ్లోర్ వంటి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పెన్సిల్ మరకలు వంటివి గోడల మీద ఉండకూడదు. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్యల నుండి బయట పడవచ్చు తద్వారా ఏ సమస్యలు లేకుండా ఆనందంగా జీవించచ్చు.