వాస్తు : పెళ్లి సమస్యలని ఈ పద్దతులతో తొలగించండి..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అయితే ఈ రోజు పండితులు పెళ్లికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి. పరిష్కారం దొరుకుతుంది. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటికోసం చూద్దాం.

ఏదైనా చిన్న చిన్న సమస్యలు వివాహానికి సంబంధించి వచ్చాయంటే కచ్చితంగా ఇవి బాగా వర్కవుట్ అవుతాయి. పెళ్లి కుదరకపోయినా, కుదిరి ఏమైనా సమస్యలు వస్తున్న కూడా పరిష్కారమవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ అబ్బాయి అయితే వివాహానికి సిద్ధంగా ఉన్నాడో అతను దక్షిణ వైపు కి ఉండేలా నిద్రపోకూడదు. అదే విధంగా ఆగ్నేయం వైపు కూడా తల పెట్టి నిద్ర పోకూడదు. అదే అమ్మాయి అయితే ఈశాన్యం వైపు తల పెట్టి నిద్ర పోకూడదు.

ఇలా చేస్తే కచ్చితంగా త్వరగా పెళ్లి అవుతుంది. అలాగే మీ యొక్క గది కూడా వెంటిలేషన్ ఉండాలి. గాలి, వెలుతురు బాగా వచ్చేటట్టు చూసుకోండి. చీకటిగా ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని ఈ మార్పు చేయండి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం పింక్ బాగా కలిసి వస్తుంది. కాబట్టి పింక్ కలర్ బెడ్ షీట్స్ ఉపయోగించండి.

ఇది ప్రేమని కలిగిస్తుంది. అలానే నిద్రపోయే గది కూడా పింక్ లేదా పసుపు రంగు అయితే మంచిది. రూమ్ లో పెయింట్లు, పువ్వులు వంటివి ఉంచండి. ఇవి ప్రేమ మరియు బ్యూటీకి చిహ్నం. ఇలా ఈ మార్పులు కనుక చేస్తే ఖచ్చితంగా మంచి కలుగుతుంది. అలానే వివాహ సంబంధిత సమస్యలతో బాధపడే వారు అరటి మొక్కని పూజిస్తే మంచిది. దీనితో ఈ సమస్యలు తొలగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news