స్తంబోద్భవుడు, స్వయంభు పంచనారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి పుణ్యక్షేత్రంలో చక్రతీర్థస్నానం, యాగశాలలో మహాపూర్ణాహుతి, శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. చక్రతీర్థ స్నానాన్ని విష్ణుపుష్కరిణిలో నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నందున బాలాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలో చక్రతీర్థస్నానం నిర్వహించారు.