పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు వాహనదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 31 లోగా చలాన్లు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ కల్పించినట్లు తెలిపారు. నో మాస్క్ చలాన్లు రూ.1000 ఉంటే రూ.100కు తగ్గించారని చెప్పారు