GDK: సంస్థ ఈ ఏడాది రూ.1,500 కోట్ల లాభాలపై ఆశలు పెంచుకుంది. ఆర్థిక సంవత్సరం ఏడో నెల నుంచి లాభాలను సాధిస్తూ వస్తున్న సింగరేణి మార్చి నాటికి రూ.1500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇప్పటికే రూ.19,000 కోట్ల అమ్మకాలు జరిపిన సంస్థ రానున్న 3 నెలల్లో మరో రూ.10,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపే అవకాశం ఉంది.