నాగార్జున సాగర్ ముఖ్య సమాచారం

నాగార్జునసాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 577.50 అడుగుల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 8,298 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా 4,416 క్యూసెక్కులు ఎస్ఎల్బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు వరద కాలువ లకు 300 క్యూసెక్కుల చొప్పున ప్రాజెక్టు నుండిమొత్తం 14,214 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ లోకి ఎలాంటి నీటి ప్రవాహం రావడం లేదని అధికారులు తెలిపారు.