హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ప్రధాన మంత్రి మోడీ నిన్న వీడ్కోలు సమయంలో అభినందించారు. రామానుజచార్యులు విగ్రహావిష్కరణ అనంతరం ఢిల్లీ పయనమైన ప్రధానమంత్రి మోడీకి వీడ్కోలు పలికేందుకు బీజేపీ నేతలు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఈటెలను మోడీకి పరిచయం చేస్తూ హూజూరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించిందని బండి సంజయ్ చెప్పారు. దీంతో ఈటెల భుజం తట్టి మెచ్చుకున్నారు.