ఉద్యోగ సంఘాలతో కాసేపటి క్రితమే సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీదని.. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నానని చెప్పారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని.. కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే టీచర్లకు శుభవార్త చెప్పారు జగన్. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని ప్రకటన చేశారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నామని.. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామన్నారు. ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.
దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని.. 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశామని వెల్లడించారు. అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నామని.. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని పేర్కొన్నారు.