మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సింగన్నగారి వేణు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ విషయాలు బయటపడ్డాయి. అతని నుండి లక్షా 35 వేల నగదు, 14 తులాల బంగారం, 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.