
వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రారంభించిన మహాపాదయాత్ర నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం వరకు పాదయాత్ర కొనసాగగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా థర్డ్‌వేవ్ కారణంగా గత ఏడాది నవంబర్ 9న నిలిచిపోయింది. తిరిగి ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించానున్నారు. నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడలో పాదయాత్ర చేయనున్నారు.