నేడు వరంగల్ కలెక్టరేట్ లో ప్రజావాణి

వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని జిల్లా పాలనాధికారి బి. గోపి ఆదివారం తెలిపారు. జిల్లా అధికారులందరూ పాల్గొనే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నిరంభ్యంతరంగా వినతులను అందించి పరిష్కరించుకోవాలని సూచించారు.