గత ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుచుకుని జగన్..మొదటి సారి సీఎం అయిన విషయం తెలిసిందే. అనేక అనుకూల కారణాలు నెలకొని ఉండటం..రాజకీయంగా జగన్ బలం పెరగడంతో..అనూహ్యంగా వైసీపీ విజయం సాధించింది. జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడం, అప్పటికే టీడీపీపై వ్యతిరేకత పెరగడం, జనసేన ఓట్లు చీల్చడం, జగన్ ప్రజాకర్షక హామీలు ఇవ్వడం..ఇలా పలు అంశాలు వైసీపీకి 151 సీట్లు తెచ్చి పెట్టాయి..జగన్ మొదటిసారి సీఎం అయ్యారు. వైసీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.
ఇది గత ఎన్నికల పరిస్తితి..అయితే వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి రెండోసారి అధికారంలోకి రావడం, రెండోసారి సీఎం అవ్వాలని చెప్పి జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. సరే టార్గెట్ బాగానే ఉంది..మరి టార్గెట్ రీచ్ అవుతారా? అంటే టార్గెట్ సంగతి పక్కన పెడితే…అసలు నెక్స్ట్ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా? అనేది మెయిన్ డౌట్.
ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి సానుకూల అంశంలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యతిరేక అంశాలు చాలా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేస్తున్నారు గాని..వాటిల్లో చాలా కొర్రీలు ఉన్నాయి. అలాగే ప్రజలపై పన్నుల భారం ఎక్కువైంది. అటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి..కేంద్రంలోని కాదు..మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కాస్త ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కేవలం పథకాల ద్వారా డబ్బులు మాత్రం ఇస్తున్నారు…అభివృద్ధి చేయడం, ఆదాయం సృష్టించడం లాంటివి పెద్దగా కనబడటం లేదు.
అన్నిటికంటే ముఖ్యమైనది…ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం..కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది..అవినీతి, అక్రమాలు ఎక్కువ ఉన్నాయని టీడీపీ ఆరోపణలు, అటు టీడీపీ పుంజుకుంటుంది..దాంతో పాటు జనసేన బలపడుతుంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి అధికారం దక్కడం అనేది కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో రెండోసారి గెలిచి అధికారం దక్కించుకోవడం అనేది చాలా కష్టమైన పని.
అందుకే జగన్ ఓ అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలు అన్నీ పక్కకు వెళ్లిపోయేలా..మూడు రాజధానుల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నినాదంతో ముందుకెళితే..తమకు ప్లస్ అవుతుందనే కోణంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు రాజధానులకు సంబంధించి ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు..ఓ జేఏసిని ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక రాష్ట్ర స్థాయిలో మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు అనే అంశంపై వైసీపీ నేతలు పోరాటం చేయడం, ప్రత్యేక సభలు నిర్వహించడం చేయనున్నారని తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో మిగతా సమస్యలు పక్కకు వెళ్ళిపోయి, కేవలం ప్రజలు రాజధాని అంశం గురించే మాట్లాడుకునేలా చేయాలని చూస్తున్నారు. అప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అనే వార్ నడవనుంది. దీని ద్వారా మరోసారి లబ్ది పొంది..ఎన్నికల్లో సత్తా చాటి..రెండోసారి సీఎం సీటులో కూర్చోవాలనేది జగన్ ధ్యేయంగా ఉంది. మరి చూడాలి ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.