ఎడిట్ నోట్: ‘కవిత’ కష్టాలు.!

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ యుద్ధం అనేక మలుపులు తిరుగుతుంది. ఓ వైపు టీఆర్ఎస్ నేతలకు ఈడీ టెన్షన్..మరోవైపు ఐటీ దాడులు, సి‌బి‌ఐ నోటీసులు అన్నట్లు పరిస్తితి ఉంది. ఇదే క్రమంలో బీజేపీకి చెక్ పెట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నడుస్తోంది. అయితే మొదట నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించింది. ఈ స్కామ్‌లో ఏపీ, తెలంగాణలకు చెందిన కీలక నేతల పేర్లు బయటకొచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ జరిగింది..ఈయన విజయసాయిరెడ్డి బంధువు. అలాగే ఈ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా మొదట నుంచి వినిపిస్తుంది. కానీ ఇది కావాలని బీజేపీ చేస్తున్న కుట్ర అని, కవిత గాని..టీఆర్ఎస్ నేతలు గాని ఖండించారు. ఇక అక్కడ నుంచి కవిత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు పెద్దగా యాక్టివ్ లేని కవిత ఈ మధ్య యాక్టివ్ అయ్యారు.

ఆ మధ్య బీజేపీ ఎంపీ అరవింద్ టార్గెట్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చారు..అలాగే బీజేపీ, షర్మిలని టార్గెట్ చేసి ట్విట్టర్‌లో ఫైర్ అవుతున్నారు. దీంతో ఇప్పుడుప్పుడే కవిత లైన్‌లో పడుతున్నారో అనుకున్న సమయంలో ఊహించని విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మళ్ళీ తెరపైకి వచ్చింది.

ఈ స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పష్టం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత రోల్‌ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్‌ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు.

కవితతోపాటు శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్‌సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్‌ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. అయితే అమిత్ ఇచ్చిన రిపోర్టులోనే కవిత పేరు వచ్చింది. ఇలా కవిత పేరు రిపోర్టులో రావడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ అంశాన్ని కవిత ఎలా డిఫెన్స్ చేసుకుంటారు..టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కవితకు కష్టాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news