ఎడిట్ నోట్: కేసీఆర్ గేమ్ స్టార్ట్.!

-

ఇంతకాలం ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చిన కే‌సి‌ఆర్ ఇప్పుడు బయటకొచ్చారు..ఇంకా దూకుడుగా రాజకీయం చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన బి‌ఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి..నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని ఈడీ విచారించనున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్..ఇంకా దూకుడు మొదలుపెట్టారు.

పైగా ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కే‌సి‌ఆర్ మాట్లాడటం విశేషం.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ, దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందని, మంత్రులను, మరికొందరు పార్టీ నేతలను వేధించారని, ఇప్పుడు తన బిడ్డ దగ్గరకొచ్చారని, మహా అయితే కవితను అరెస్టు చేస్తారని,  జైలుకు పంపిస్తారని,  అంతేగదా.. ఏం చేస్తారో చూద్దాం.. ఎవరికీ భయపడేది లేదని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటం ఆపేదే లేదని, ఆ  పార్టీని గద్దె దించేవరకు పోరాడతామని, 2024 తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండదని ఛాలెంజ్ చేశారు.

kcr

మొత్తానికి కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలోనే కే‌సి‌ఆర్..ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అదే సమయంలో ఇంకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పుకొచ్చారు. ఇక సిట్టింగులకు దాదాపు అందరికీ సీట్లు ఇస్తామని కే‌సి‌ఆర్ ప్రకటించారు. తప్పులు చేసిన వారికి మాత్రం సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. అలాగే బి‌ఆర్‌ఎస్ 100కి పైనే సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయని, నేతలంతా కష్టపడాలని, ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు.  అటు పథకాల అమలుని పక్కాగా ముందుకు తీసుకెళ్లాలని, ఏ ఒక్క లబ్దిదారుడు ఓటు పోకుండా చేయాలని అంటున్నారు.

ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరులోనే జరుగుతాయని, డిసెంబరులో ఎన్నికలంటే అందుకు రెండు, మూడునెలల ముందే కేంద్రం ఎన్నికల నోటిఫికేషన్‌ ఇస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.  ఇక మిగిలింది ఆరు నెలలు మాత్రమేనని,  నేతలంతా జనంలో ఉండాలని, నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రలు చేపట్టాలని నిర్దేశించారు. మొత్తానికి కేసీఆర్ పోలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news