ఎడిట్ నోట్: చంద్రబాబు@చంద్రశేఖర్..!

-

మరి రాజకీయంగా లబ్ది పొందాలని అనుకుంటున్నారో లేక నిజంగానే బీజేపీ వల్ల దేశం నాశనం అయిపోతుందని భావిస్తున్నారో తెలియదు గాని…మొత్తం మీద కేసీఆర్…బీజేపీని గట్టిగా టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌కు గెలవడానికి ఒక అస్త్రం కావాలి…అయితే గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంతో కేసీఆర్..గెలిచి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ సారి కేసీఆర్‌కు చెప్పుకోవడానికి పెద్దగా ఏమి కనిపించడం లేదు. పైగా టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది.

ఈ క్రమంలో కేసీఆర్ రూట్ మార్చారు…తెలంగాణలో బలపడుతున్న బీజేపీన్ని టార్గెట్ చేశారు. నిజానికి తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది..బీజేపీ బలపడుతున్నా సరే ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం కనిపిస్తుంది. అయినా సరే కేసీఆర్…బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు.

దానికి కారణం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం…అంటే తమ లోపాలని ఎలాగోలా కప్పిపుచ్చుకోవాలని చెప్పి…మోదీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మోదీ సర్కార్ వల్ల ధరలు పెరిగిపోయాయని, దేశం నాశనం అయిపోతుందని, మతపిచ్చిగాళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పి ప్రజలకు పిలుపునిస్తారు. అలాగే దేశ రాజకీయాల్లోకి పోదామనని, మోదీ సర్కార్‌ని గద్దె దింపుదామని కేసీఆర్ అంటున్నారు.

అంటే మోదీని టార్గెట్ చేసి ఇటు రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని, అలాగే డేస్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ చూస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్…బీజేపీకి యాంటీగా రాజకీయం చేస్తున్నారు. అయితే సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2019 ఎన్నికల ముందు ఏపీలో కేసీఆర్ మాజీ గురువైన చంద్రబాబు సైతం..బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి…మోదీ సర్కార్‌ టార్గెట్‌గా రాజకీయం చేశారు. పైకి ప్రత్యేక హోదా కోసం పోరాడినట్లు కనిపించారు గాని….దాని ద్వారా రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా పనిచేశారు.

అలాగే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులని ఏకం చేయాలని చూశారు. అబ్బో ఎన్నికల ముందు బాబు…బీజేపీ టార్గెట్‌గా చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు..కానీ అంత చేసిన చివరికి బాబు పరిస్తితి ఏమైంది…దేశం సంగతి పక్కన పెడితే…కనీసం రాష్ట్రంలో గెలవలేకపోయారు…చిత్తుగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. మరి ఇప్పుడు బాబు బాటలోనే కేసీఆర్ ముందుకెళుతున్నారు…ప్రతి సభలోనూ మోదీ సర్కార్‌నే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. అలాగే ప్రతి సారి చెప్పిందే చెబుతున్నారు. మరి కేసీఆర్ మాటలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో తెలియకుండా ఉంది.

ఎన్నికల వరకు కేసీఆర్ ఇలాగే ముందుకెళ్లెలా ఉన్నారు..మరి అప్పుడు కేసీఆర్ పొజిషన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే 2019 ఎన్నికల్లో బాబు…బీజేపీపై ఎక్కువ ఫోకస్ పెట్టి…వైసీపీని నెక్స్ట్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీని వల్ల వైసీపీకి బెనిఫిట్ జరిగింది…మరి ఇప్పుడు కేసీఆర్..బీజేపీని టార్గెట్ గా పెట్టుకుని కాంగ్రెస్‌ని లైట్ తీసుకున్నారు…మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news